Presentations | Telugu
Alluri Sitaramaraju, a revolutionary from the coastal region of northern Andhra Pradesh, led a mighty rebellion against the British atrocities on the forest tribes of the region. Such was his notoriety amongst the British that they had to bring in special envoys from Madras and Malabar to quell the rebellion that was growing in intensity by the day. Fondly known as the Manyam Dora by the forest tribes, his name still resounds in the region and he remains a symbol of pride, courage and hope for all the Telugu people. Know more about his childhood, influences, his pilgrimages across the country, his transformation into a monk and most importantly how he brought about the rebellion by training, educating and inspiring tribal people of the forests of Andhra Pradesh and his eventual martyrdom at the hands of the British, in this 2-part series.
అల్లూరి సీతారామరాజు, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతానికి చెందిన విప్లవకారుడు. ఈ ప్రాంతంలోని అటవీ గిరిజనులపై బ్రిటిష్ దురాగతాలకు వ్యతిరేకంగా బలమైన తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. బ్రిటీష్‌వారికి ఆయన పట్ల ఉన్న భయభ్రాంతులు ఎటువంటివంటె, రోజురోజుకూ తీవ్రరూపం దాల్చే తిరుగుబాటును అణిచివేసేందుకు మద్రాసు మరియు మలబార్ నుండి ప్రత్యేక పోలీసు సిబ్బందులను రప్పించవలసి వచ్చింది. ఆటవికులచే మన్యం దొర అని పిలవబడే అతని పేరు ఇప్పటికీ ఈ ప్రాంతంలో మారుమోగుతుంది. అతని పేరు తెలుగు ప్రజలందరికీ గర్వం, ధైర్యం మరియు ఆశాకిరణానికి ప్రతీకగా వెలుగుతూనేవుంది. అతని బాల్యం, అతనిపై ప్రభావాలు, దేశవ్యాప్తంగా అతని తీర్థయాత్రలు, సన్యాసిగా మారడం మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అడవులలోని గిరిజనులకు శిక్షణ, విద్య మరియు స్ఫూర్తిని ఇవ్వడం ద్వారా అతను తిరుగుబాటును ఎలా తీసుకువచ్చాడు, చివరికి అతను బ్రిటిషువారి చేతులలో అతి దారుణంగా ఎలా మరణించారో ఈ 2-భాగాల సిరీస్‌లో మీకు తెలియజేయడం జరిగింది.
Free
PPTX (36 Slides)
Presentations | Telugu