Logo
Search
Search
View menu

Forts of Telangana Nagunur Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information on these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Nagunur Fort, located in the Karimnagar District of Telangana. The fort stands testimony to the majestic rule of the Kakatiyas. The fort was once home to over 400 temples and the life and regality of this place can only be imagined today. After having been in the control of various dynasties like the Vemulavada Chalukyas, the Kalyani Chalukyas, the Kakatiyas, the Bahamanis, the Qutb Shahis, the Mughals, and the Asaf Jahis among others, the fort is today in a state of ruin. Know fascinating details of the fort, its history and its architecture through this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని దోమకొండ సంస్థానం కవర్ చేయబడింది. ఇది కరీంనగర్‌ జిల్లాలో ఉంది. నగునూరు కోటలోని ప్రతి ప్రాకారంలోనూ ఆనాటి కాకతీయరాజుల పాలనలోని మహా వైభవంతో పాటు వారి రాజసం, దర్పం, ఆనాటి ప్రజల సంగతులు మనకు కళ్ళకు కట్టినట్టుగా నేటికీ కనిపిస్తాయి. సుమారు 400 దేవాలయాలతో వేలాది భక్తుల జయజయ ధ్వానాలతో, వేద పండితుల వేదఘోషలతో ఎంతో వైభవంగా శతాబ్దాల పాటు విరాజిల్లిన ‘నగునూరు’ కోట, వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, బహమనీయులు, కుతుబ్‌షాహీలు, మొగలాయిలు, అసఫ్‌ జాహీలేగాక మరెందరో రాజుల పరిపాలనను చవిచూసిన ఈ కోట నేడు శిథిలావస్థలో ఉంది. ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర మరియు నిర్మాణ శైలి గురించిన మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (35 Slides)

Forts of Telangana Nagunur Fort

Presentations | Telugu